📄 ePaper
Friday, February 20, 2026
📄 ePaper
HomeBusinessWhy Change Gold Price Every day | బంగారం ధర రోజూ ఎందుకు మారుతుంది.?

Why Change Gold Price Every day | బంగారం ధర రోజూ ఎందుకు మారుతుంది.?

బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఇది పెట్టుబడి, భద్రత, అలాగే ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే ముఖ్యమైన సంపత్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే చిన్న మార్పు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తుంది. అయితే బంగారం ధర రోజూ ఎందుకు మారుతుంది? దీనికి ప్రధాన కారణాలు
ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిమాండ్ & సప్లై ప్రభావం (Demand & Supply Impact)

బంగారం ధరను నిర్ణయించే ప్రధాన అంశం డిమాండ్ మరియు సప్లై.. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. ఈ సమయంలో డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా గోల్డ్ మైనింగ్ తగ్గడం లేదా దిగుమతులు తగ్గినప్పుడు సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధర పెరగడం, డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గడం సహజమైన ప్రక్రియ.

గ్లోబల్ ఎకానమీ & కరెన్సీ మార్పులు (Global Economy & Currency Fluctuations)

బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటాయి. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితి ఎర్పడినప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కొంతమంది పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు.

ఇది కూడా చదవండి :  Gold Price Crash: రూ.30 వేలకుపైగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుకు ఇదే సరైన సమయం.!

 

బంగారంధర రోజూ మారడానికి అనేక అంతర్జాతీయ మరియు దేశీయ కారణాలు ఉన్నాయి. ఈ మార్పులవెనుక ఉన్న అంశాలను అర్థం చేసుకుంటే సరైన సమయంలో బంగారం కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి, పెట్టడం సులభమవుతుంది. బంగారం ధర తెలుసుకోవడమే కాదు, దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం కూడా ప్రతి పెట్టుబడిదారుడికి అవసరం.

– QAMAR SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page