📄 ePaper
Monday, March 16, 2026
📄 ePaper
HomeBusinessGold ATM | బంగారం అమ్మకం ఇక షాపులకే పరిమితం కాదు.. హైదరాబాద్‌లో దేశంలోనే తొలి...

Gold ATM | బంగారం అమ్మకం ఇక షాపులకే పరిమితం కాదు.. హైదరాబాద్‌లో దేశంలోనే తొలి గోల్డ్ ATM ప్రారంభం

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. టెక్నాలజీ కి కేర్ ఆఫ్ అడ్రస్ కమారిన హైదరాబాద్ లో మరోసారి వినూత్న ఆవిష్కరణ తో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపింది. మన ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న పాత బంగారాన్ని కేవలం 30 నిమిషాల్లో నగదుగా మార్చే అత్యాధునిక సదుపాయం ఇప్పుడు నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ఫిన్‌టెక్ స్టార్టప్ గోల్డ్ సిక్కా (Goldsikka) దేశంలోనే తొలి AI పవర్డ్ గోల్డ్ ATMను హైదరాబాద్‌లో ప్రారంభించింది.

ఇకపై పాత బంగారం అమ్మాలంటే జ్యూవెలరీ షాపుల చుట్టూ తిరగడం, గంటల తరబడి క్వాలిటీ చెక్ కోసం వేచి ఉండడం, బేరసారాలు చేయడం వంటి తలనొప్పులన్నీ ఉండవు. పూర్తిగా పారదర్శకంగా, ఆటోమేటెడ్ విధానంలో బంగారం విలువ లెక్కించి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ చేసే వ్యవస్థగా ఈ గోల్డ్ ATM నిలుస్తోంది.

30 నిమిషాల్లో అకౌంట్‌లో డబ్బు ఎలా..?

ఈ AI గోల్డ్ ATM పనిచేసే విధానం పూర్తిగా టెక్నాలజీ ఆధారితం. వినియోగదారు తమ బంగారాన్ని యంత్రంలో ఉంచగానే, అది ముందుగా కరిగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా బంగారం బరువు, స్వచ్ఛత (Purity)ను ఖచ్చితంగా లెక్కిస్తుంది. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా జరిగే ఈ ప్రక్రియలో మోసాలకు అవకాశం ఉండదు. ఆ సమయంలో మార్కెట్‌లో ఉన్న బంగారం ధరను అనుసరించి మొత్తం విలువను లెక్కించి, కేవలం అరగంటలో వినియోగదారి బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ అవుతుంది.

ఇది కూడా చదవండి :  పసిడి పరుగులో కొత్త అధ్యాయం : రూ.1.5 లక్షల దిశగా బంగారం.. మార్కెట్‌ సంకేతాలు, మౌన హెచ్చరికలు..

అమ్మకంతో పాటు.. కొనుగోలు కూడా…!

ఈ గోల్డ్ ATM ప్రత్యేకత కేవలం పాత బంగారం అమ్మకానికే పరిమితం కాదు. ఇందులో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు 24 క్యారెట్ బంగారు నాణేలను 24/7 కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదనంగా, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీతో వర్చువల్ ట్రయల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు నగలను వర్చువల్‌గా ధరించి చూసి, నచ్చితే వెంటనే కొనుగోలు చేయవచ్చు.

చోరీ బంగారం లేదా అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టేందుకు గోల్డ్ సిక్కా కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రతి లావాదేవీకి ముందు వినియోగదారులు తప్పనిసరిగా KYC వివరాలు అందించాలి. గుర్తింపు ధృవీకరణ, నేర చరిత్ర తనిఖీ అనంతరమే యంత్రం లావాదేవీని అనుమతిస్తుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా లావాదేవీని వెంటనే బ్లాక్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గోల్డ్ సిక్కాకు 14 సాధారణ గోల్డ్ ATM లు ఉండగా, వచ్చే ఏడాదిలో 100 వరకు AI పవర్డ్ గోల్డ్ ATMలను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి తుది అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.

AI Gold ATM in Hyderabad allowing users to sell old gold and receive instant bank transfer
India’s first AI-powered Gold ATM launched in Hyderabad, enabling instant cash for old gold

అత్యవసర సమయంలో డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా , బ్యాంక్ లోన్‌లకు వెళ్లకుండా, ఇంట్లో ఉన్న బంగారాన్ని నమ్మకంగా నగదుగా మార్చుకునే మార్గంగా ఈ AI గోల్డ్ ATM మారనుంది. టెక్నాలజీ, ఫైనాన్స్ కలయికతో రూపొందిన ఈ వ్యవస్థ సామాన్యుడి అవసరాలకు ఎంతగా ఉపయోగపడుతుందో చూపించే స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది భారత గోల్డ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి :  Bull Market మరియు Bear Market అంటే ఏమిటి?

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 21, 2025 | 07:45 AM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page