HomeCrime Newsఆవుల పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

ఆవుల పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

 • టాటా వాహనం, మొబైల్ ఫోన్ సీజ్

 • మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు : సీఐ రమేష్

 వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఆవుల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అత్యంత క్రూరంగా ఆవులను కబేళాకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇచ్చోడ సీఐ రమేష్ వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇచ్చోడ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఓ టాటా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో మూడు ఆవులను అత్యంత తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆవుల రవాణా చేస్తుండటంతో పోలీసులు వెంటనే వాహన డ్రైవర్‌తో పాటు పశువుల యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వ్యక్తులను నిర్మల్ పట్టణానికి చెందిన షారుఖ్ ఖురేషి, గుడిహత్నూర్‌కు చెందిన మహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. బజార్‌హత్నూర్ మండలం అనంతపూర్ గ్రామంలో తక్కువ ధరకు ఈ ఆవులను కొనుగోలు చేసి, అధిక లాభాల కోసం నిర్మల్‌ కు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి మూడు ఆవులు, రవాణాకు ఉపయోగించిన టాటా వాహనం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించారు.

పశువులను అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ రమేష్ హెచ్చరించారు. ముఖ్యంగా కబేళాలకు గోవులను రవాణా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరించేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular