e-paper
Wednesday, December 17, 2025
HomeTelanganaAdilabadBRS Vs Congress | బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఢీశుం.. ఢీశుం

BRS Vs Congress | బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఢీశుం.. ఢీశుం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ కేంద్రంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో వాగ్వివాదం జరిగింది. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితులని అదుపులోకి తీసుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page