HomeTelanganaAdilabadకిటకిటలాడిన మీసేవ కేంద్రాలు.. పత్రాల కోసం బారులు తీరిన జనం

కిటకిటలాడిన మీసేవ కేంద్రాలు.. పత్రాల కోసం బారులు తీరిన జనం

* ఎస్ఐఆర్ (SIR) నోటీసులతో ఆందోళన

 * పత్రాల కోసం తరలివచ్చిన ప్రజలు

 * ఇచ్చోడలో జనసంద్రంగా మారిన మీసేవ ప్రాంగణాలు

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ :ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాల వద్ద శనివారం ప్రజలు బారులు తీరారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించి అధికారుల నుంచి నోటీసులు రావడంతో, దానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పించేందుకు ప్రజలు ఒక్కసారిగా మీసేవ కేంద్రాలకు పోటెత్తారు. ఈ ప్రక్రియలో భాగంగా తప్పనిసరిగా డాక్యుమెంట్లను అధికారులకు అందించాల్సి ఉండటంతో.. మండలంలోని పలు మారుమూల గ్రామాల నుంచి రైతులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే మీసేవ కేంద్రాలకు చేరుకున్నారు. సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం అందరూ ఒకేసారి తరలిరావడంతో కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర దర్శనమిచ్చాయి. వందలాది మందితో మీసేవ ప్రాంగణాలన్నీ జనసంద్రంగా మారాయి.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular