వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన అసిఫ్ ఖాన్‌కు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయనను పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అసిఫ్ ఖాన్ నియామకాన్ని స్వాగతించారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అందరినీ కలుపుకొని పోవాలని ఆకాంక్షించారు. అసిఫ్ ఖాన్ నాయకత్వంలో ఇచ్చోడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంరం కోటేష్, పోతారెడ్డి, శివాజీ, లతీఫ్, షఫీ, బాబా, ఖుద్దూస్, మాజీ సర్పంచ్ రాథోడ్ దుదారం, భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ నౌషాద్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అసిఫ్ ఖాన్‌కు వారంతా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అసిఫ్ ఖాన్ : ఘనంగా సన్మానించిన నాయకులు
RELATED ARTICLES
