HomeTelanganaAdilabadఇచ్చోడ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

ఇచ్చోడ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

• భక్తులకు ఘనంగా పులిహోర పంపిణీ

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల కోసం ఇచ్చోడ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పులిహోర పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

గణేశ్ నిమజ్జనానికి తరలివెళ్తున్న యువత, మహిళలు, చిన్నారులకు ప్రెస్ క్లబ్ సభ్యులు స్వయంగా పులిహోర పొట్లాలు అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు కనీస ఆహారం అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. పంపిణీ కార్యక్రమంతో శివాజీ చౌక్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు.

Ichoda Press Club members distributing Pulihora to devotees during Ganesh Nimajjanam at Shivaji Chowk.
Ichoda Mandal Press Club members distributing food to devotees during the Ganesh immersion procession.

ఈ సేవా కార్యక్రమంలో ఇచ్చోడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్తూరు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అజయ్ రాథోడ్, ఉపాధ్యక్షులు సిరిగిరి శ్రీనివాస్, ఎం.ఏ. జాకీర్, గౌరవ సలహాదారులు సువర్ణ మహాదేవ్, రవూఫ్ ఖాన్, బచ్చువార్ లక్ష్మణ్ తదితర సభ్యులు, స్థానికులు, యువకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular