HomeTelanganaపెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ

పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

• పారదర్శక పాలన, సత్వర సేవలందిస్తా: బి. ఓం ప్రకాష్

• గతంలో సుల్తానాబాద్‌లో మెరుగైన సేవలు అందించి గుర్తింపు

 

వాస్తవ నేస్తం,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉండటంతో, ఆయన అనుభవం, నిబద్ధత మరియు పరిపాలనా సామర్థ్యాన్ని గుర్తించిన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

గతంలో సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సమయంలో ఓం ప్రకాష్ తన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం విధులకు పరిమితం కాకుండా, కార్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవను పలువురు అభినందించారు. ఈ విషయాన్ని జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కార్యాలయానికి అవసరమైన మరమ్మతులు మరియు వసతులు కల్పించారు. దీంతో ఉద్యోగుల పనితీరుతో పాటు ప్రజలు, దస్తావేజు లేఖరులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.

బాధ్యతల స్వీకరణ అనంతరం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ బి. ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, జవాబుదారీతనంతో వేగవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా శ్రమిస్తానని, కార్యాలయ నిర్వహణలో సమన్వయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular