📄 ePaper
Thursday, March 5, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadACB ride : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా సహకార అధికారి

ACB ride : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా సహకార అధికారి

• రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

వాస్తవ నేస్తం,మంచిర్యాల : అత్యాస చివరికి కటకటాల పాలు చేస్తుంది. లంచం తీసుకుంటుండగా ఎందరో అవినీతి అధికారులు పట్టుబడుతున్న కూడా కొందరిలో తీరు మారడం లేదు. రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా జిల్లా సహకార సంఘం కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పిఎసిఎస్ సెక్రటరీ వెంకటేశ్వర్ గౌడ్ గతంలో సస్పెన్షన్ కు గురయ్యారు. పెండింగ్ వేతన బకాయిలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసే విషయంలో జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ ను ఆశ్రయించాడు. పెండింగ్ వేతనం మంజూరి కోసం రూ. 7 లక్షలు ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని ఇక్బాల్ నగర్ క్యాంప్ ఆఫీసులో మొదటి విడతగా వెంకటేశ్వర్ గౌడ్ రూ. 2 లక్షలు లంచం ఇస్తుండగా మంచిర్యాల ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడిన జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పై విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి :  komaram Bheem : గిరిజన స్వాతంత్ర్య యోధుడు కొమురం భీమ్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page