📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
HomeTelanganaనకిలీ విత్తనాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నకిలీ విత్తనాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

• బక్రీద్ వేళ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

• రౌడీ షీటర్లపై నిరంతర నిఘా

వాస్తవ నేస్తం,అదిలాబాద్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, ముఖ్యంగా రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి ఆయన నెలవారీ నేర సమీక్షా సమావేశం’ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పెండింగ్ కేసుల పురోగతి, శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీ క్షుణ్ణంగా సమీక్షించారు.

వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందులు విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రైతులను నట్టేట ముంచే కేటుగాళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి తెలిపారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని చెక్‌పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. పోలీస్ స్టేషన్లలో అమలవుతున్న 7 వర్టికల్స్ (డయల్ 100, ఇన్వెస్టిగేషన్, కోర్ట్, సెక్షన్ ఇంచార్జ్, రికార్డ్స్, క్యూఆర్ కోడ్, రిసెప్షన్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామాల్లో వీటి ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. నేరస్తుల వేలిముద్రలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.

రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి సూచించారు. రాత్రి సమయాల్లో గస్తీని మరింత బలోపేతం చేయాలి. అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని వదలకూడదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సాగాలి. సిబ్బంది పనితీరును ఎస్హెచ్ఓలు నిరంతరం పర్యవేక్షించాలి సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, మరియు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular