📄 ePaper
Tuesday, March 24, 2026
📄 ePaper
HomeTrending Newsబోథ్ గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాయిదా పడనుందా..?

బోథ్ గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాయిదా పడనుందా..?

 

  • ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాని వార్డు మెంబర్లు
  • హాజరైన సర్పంచ్, ఉప సర్పంచ్
  • 13 మంది వార్డు సభ్యులు గైర్హాజరు

వాస్తవ నేస్తం, ఆదిలాబాద్ : నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు (సోమవారం) జరగనుండగా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మేజర్ గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడనుందా…? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారానికి13 మంది వార్డ్ మెంబర్లు హాజరు కాకపోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి గ్రామ సభ నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికే సభ్యులు హాజరు కాకపోవడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కేవలం సర్పంచ్, ఉప సర్పంచ్ లు , కొంతమంది వర్డ్ నెంబర్లు హాజరు కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. గైర్హాజరైన సభ్యులు హాజరుకావడానికి అధికారులు కొంత సమయం ఇచ్చినట్లు, సభ్యులందరూ హాజరుకానీయడల ఉన్నవారితోనే ప్రమాణ స్వీకారం చేయించుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి :  Gold Loan : బడ్జెట్ 2026లో బంగారు రుణాలకు ఊరట? వడ్డీ తగ్గింపుపై ఆశలు పెరుగుతున్న వేళ..
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page