వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఈ మధ్యకాలం కాస్త నిరాశే ఎదురవుతోంది. రోజుకో కొత్త రికార్డుతో బంగారం ధరలు పెరుగుతుండగా, వెండి కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అనే ఆశతోచూస్తున్న వినియోగదారులకు మాత్రం ఊరట కనిపించడం లేదు.
ఇప్పటికే బంగారం సామాన్యుడి చేతికి అందని స్థాయికి చేరింది. వెండి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కొన్నిసార్లు స్వల్పంగా తగ్గినా, మళ్లీ పెరుగుతాయన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి కొనుగోలు చేయడం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.
పెరుగుతున్న ధరలు – Consumers Under Pressure
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు పెరగడం ఒక సాధారణ వార్తగా మారిపోయింది. ఎంత పెరిగాయన్నది కంటే,
ప్రతిరోజూ పెరుగుతూనే ఉండటమే వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఇప్పటికే బంగారం, వెండికి దూరమవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు పెరిగాయని, కొత్త ఏడాదిలో అయినా ధరలు అందుబాటులోకి రావాలని
చాలా మంది ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్లు, శుభకార్యాల కోసం బంగారం వినియోగాన్ని చాలామంది
తగ్గించారు.
బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు, వన్ గ్రాము గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో ఈ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

Today’s Gold & Silver Rates – Hyderabad Market Update
పెట్టుబడిదారులకు కూడా ఈ మధ్య ధరల హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఒక్కరోజే కిలో వెండి
ధరలో స్వల్ప తగ్గుదల కనిపించినా, దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పెరుగుతాయన్న అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి:
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,27,240
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,39,240
- వెండి (1 కిలో): ₹2,80,900
ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధరలో పతనం కనిపించింది. అయితే మధ్యాహ్నం వరకు ధరల్లో
మార్పులు ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Note: బులియన్ మార్కెట్ ధరలు సమయానుసారం మారవచ్చు. కొనుగోలు ముందు తాజా ధరలు నిర్ధారించుకోవడం మంచిది.
