• సెటైర్‌గా మొదలై సంచలనంగా మారిన కథ..!
రాజకీయాల్లో ఎన్నో పార్టీలను, విచిత్రమైన పేర్లను మనం చూశాం. కానీ, ఒక యువకుడు ఏకంగా కాక్రోచ్ (బొద్దింక) జనతా పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. వినడానికి విడ్డూరంగా, కాస్త నవ్వులాటగా అనిపించినా.. దీని వెనుక ఉన్న కారణం, ఇప్పుడు ఈ పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..!
అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది..?
ఈ పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. నిరుద్యోగులు సోమరిపోతుల్లా మారి, బొద్దింకల్లా (Cockroaches) తయారై.. జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తలుగా మారి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ తర్వాత ఆయన తాను ఆ మాటలను కేవలం సరదాగా (కామెడీగా) అన్నానని వివరణ ఇచ్చినప్పటికీ.. యువతలో మాత్రం ఆ పదాలు తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి.
ఈ వ్యాఖ్యలను అభిజిత్ దీప్కే అనే యువకుడు చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలకు నిరసనగా, అదే పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ’ ని స్థాపించాడు.
ఈ పార్టీ ప్రధాన లక్ష్యాలు అని, అవి యువత పక్షాన నిలబడటం, ప్రజాధనం ఎటు పోతుందో ప్రభుత్వాన్ని నిలదీయడం. యువతను కించపరిచే విధానాలపై పోరాడటం. అని ఆయన తెలిపారు.
తొలుత ఒక సెటైర్ (వ్యంగ్యం) లాగా మొదలైన ఈ పార్టీ ఆలోచన, సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. యువత ఈ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం 48 గంటల్లోనే 40 వేల మంది ఈ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం దీనికి వస్తున్న ఆదరణకు అద్దం పడుతోంది.
ఒకప్పుడు యువతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న ఒక కొత్త ట్రెండ్‌కు దారితీశాయి. కేవలం సరదాగా మొదలైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సోషల్ మీడియాలో సీరియస్ డిస్కషన్ పాయింట్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..!
