e-paper
Thursday, January 8, 2026
HomeCrime Newsనేరాల నియంత్రణకే "ఆపరేషన్ ఛబుత్ర"

నేరాల నియంత్రణకే “ఆపరేషన్ ఛబుత్ర”

• నేరాలు, దొంగతనాల అదుపునకు ప్రత్యేకంగా చర్యలు

• 150 మంది యువకులకు కౌన్సిలింగ్, తల్లిదండ్రులకు అప్పగింత

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : నేరాల నియంత్రణకే ఆపరేషన్ ఛబుత్ర నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాలలో అనవసరంగా, అకారణంగా తిరిగే వారిపై చట్టపకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో శనివారం రాత్రి పట్టణంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అకారణంగా సంచరిస్తున్న 150 మందిని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లను తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం యువకులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని పదేపదే ఆధారంగా సంచరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అకారణంగా ఎవరైనా రోడ్లపై, గద్దలపై హోటళ్ల ముందు భాగంలో ప్రధాన కూడళ్ల వద్ద వారి వారి వీధులలో అనవసరంగా కూర్చోకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అర్ధరాత్రి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణము కలగజేయడానికి మరియు నేరాలను నియంత్రణకు యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలియజేశారు. నేర రహిత సమాజ నిర్మాణానికి, పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇదేవిధంగా అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని యువత సన్మార్గంలో ఉండాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో, ప్రయాణాలకు వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లేవారు, పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు కాకుండా వేరే ఎవరు తిరిగిన పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోబడతారని తెలిపారు. ఈ ఆపరేషన్లో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తో పాటు పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు , రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, మావల ఎస్సై రాజకుమార్, మధుకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, వెంకటి, మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page