📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessవెండి ధరలు సగానికి పైగా తగ్గే అవకాశం.?.. ప్రముఖ సెక్యూరిటీస్ నిపుణుల అంచనాలు

వెండి ధరలు సగానికి పైగా తగ్గే అవకాశం.?.. ప్రముఖ సెక్యూరిటీస్ నిపుణుల అంచనాలు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: గత కొన్ని వారాలుగా వెండి ధరలు సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. బంగారంతో పోటీ పడే స్థాయికి చేరి, కిలో వెండి ధరలు రికార్డు స్థాయిని తాకాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నాలుగు రోజుల్లో వెండి ధరలు కిలోకు సుమారు రూ.16 వేల వరకు పెరిగిన నేపథ్యంలో, ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు మొగ్గుచూపడంతో మార్కెట్‌లో స్వల్ప సవరణ మొదలైంది.

తాజా ట్రేడింగ్ సెషన్‌లో వెండి ధరలు కిలోకు రూ.2,52,000 వద్ద నమోదయ్యాయి. ఇది మునుపటి రోజుతో పోలిస్తే సుమారు రూ.5,000 తగ్గుదల. గ్రాము వెండి ధర రూ.252గా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.2,570 నుంచి రూ.2,520కి దిగివచ్చింది. అదే సమయంలో 8 గ్రాముల వెండి ధర కూడా రూ.40 తగ్గి రూ.2,016 వద్ద ట్రేడవుతోంది. ఈ తగ్గుదలని మార్కెట్ నిపుణులు తాత్కాలిక దిద్దుబాటుగా అభివర్ణిస్తున్నారు.

ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకే రోజులో వెండి ధరలు కిలోకు సుమారు రూ.9 వేల వరకు పడిపోగా, బంగారం ధరలు కూడా 10 గ్రాములకు రూ.1,370 మేర తగ్గాయి. ఈ పరిణామం వెండిని పెట్టుబడిగా లేదా ఆభరణాల కోసం కొనాలనుకునే వారిలో చర్చకు దారితీసింది.

అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు వెండి ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని సూచిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్ల కీలక స్థాయిని నిలబెట్టుకోలేకపోతున్నాయి. తాజాగా 78 డాలర్లకు దిగివచ్చిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మరింత అమ్మకాల ఒత్తిడి ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి :  Today gold price in Hyderabad | హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు (11 ఫిబ్రవరి 2026): పసిడి ప్రియులకు ఊరట లభించిందా?

ఈ నేపథ్యంలో TD సెక్యూరిటీస్ సంచలన అంచనాలు చేసింది. మార్చి ఫ్యూచర్స్‌లో వెండి ధరలు ఔన్సుకు 40 డాలర్ల వరకు పడిపోవచ్చని బ్యాంక్ అంచనా వేసింది. TD సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ ఇప్పటికే వెండి మార్కెట్‌లో పెద్ద షార్ట్ పొజిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆయన 78 డాలర్ల వద్ద షార్ట్ చేసి, లక్ష్యంగా 40 డాలర్లను నిర్దేశించారు. అంటే రాబోయే మూడు నెలల్లో వెండి ధరలు దాదాపు సగానికి తగ్గే అవకాశం ఉందన్న మాట.

గతంలో వెండి ధరలు ఔన్సుకు 84 డాలర్ల వరకు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పెరుగుదలకి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా కామెక్స్ మార్కెట్‌లో వెండి ఓపెన్ ఇంట్రెస్ట్‌లో దాదాపు 13 శాతం అమ్ముడుపోయే అవకాశం ఉందని అంచనా. ఇది జరిగితే ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశముంది.

అదే సమయంలో అమెరికాలో వెండిపై సుంకాలు విధించవచ్చన్న భయంతో గత కొన్ని నెలలుగా భారీ మొత్తంలో వెండి అక్కడే నిలిచిపోయింది. అయితే అలాంటి సుంకాలు విధించే అవకాశం లేదని TD సెక్యూరిటీస్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ అనిశ్చితి తొలగితే, ఆ వెండి అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదలై సరఫరా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ధరలు మరింత దిగివచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే గతంలో TD సెక్యూరిటీస్ చేసిన కొన్ని అంచనాలు పూర్తిగా నిజం కాలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అక్టోబర్‌లో బ్యాంక్ చేసిన ప్రతికూల అంచనాల తర్వాత వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అందువల్ల ఒక్క నివేదిక ఆధారంగా వెంటనే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి :  చేవెళ్లలో ఘోర Road Accident – 20 మంది మృతి
Falling silver prices chart showing global market weakness and expert warning
Silver Prices May Drop Sharply as Global Market Signals Turn Weak

మొత్తానికి వెండి ధరలు భారీగా తగ్గే అవకాశాలపై చర్చ సాగుతున్నప్పటికీ, మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉన్న ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గుతున్నాయనే కారణంతో తొందరపాటు కొనుగోళ్లు చేయకుండా, కొంత సమయం వేచి చూసి నిర్ణయం తీసుకోవడం పెట్టుబడిదారులకు మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Disclaimer : ఈ కథనంలో పేర్కొన్న అభిప్రాయాలు, అంచనాలు ఆయా విశ్లేషకులు మరియు సంస్థల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి పెట్టుబడి సలహాలుగా పరిగణించరాదు. వెండి లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. ఈ కథనం పూర్తిగా సమాచారం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది.

Author: QAMAR SD

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88