HomeCrime Newsబస్సులో నుంచి దూకి మహిళ దుర్మరణం

బస్సులో నుంచి దూకి మహిళ దుర్మరణం

📰 Generate e-Paper Clip

 * నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఘటన

 * ఇచ్చోడ సమీపంలో విషాదం

 * రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బస్సు నుంచి కిందకు దూకి దుర్మరణం చెందింది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ – ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఇచ్చోడ మండల కేంద్ర సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 30 ఏళ్ల మహిళ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో బస్సు ఇచ్చోడ సమీపంలోని జున్ని ఎక్స్ రోడ్ వద్దకు చేరుకోగానే, సదరు మహిళ ఒక్కసారిగా నడుస్తున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన 108 సిబ్బంది ఈఎంటి రాకేష్, పైలెట్ నాగోరావు క్షణాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలికి అంబులెన్స్‌లోనే సీపీఆర్ (CPR) చేస్తూ అత్యవసర చికిత్స అందించి ఆదిలాబాద్‌లోని రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. అయితే, రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఈసీజీ (ECG) పరీక్షలు నిర్వహించి పరిశీలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మహిళ బస్సు నుంచి దూకడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular