📄 ePaper
Monday, February 9, 2026
📄 ePaper
HomeBusinessGoldGold Loan 2026 : బంగారు రుణాల కొత్త లెక్కలు.. తక్కువ వడ్డీలో గోల్డ్ లోన్...

Gold Loan 2026 : బంగారు రుణాల కొత్త లెక్కలు.. తక్కువ వడ్డీలో గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..

రోజురోజుకు బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో మధ్యతరగతి వారికి బంగారం కొనుగోలు చేయడం ఒక కలగానే మిగిలిపోతుందని చెప్పవచ్చు. మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ఖర్చులు, అత్యవసర నగదు అవసరాల మధ్య 2026లో బంగారు రుణాలు (Gold Loans) మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక సాధనంగా మారాయి. బ్యాంకులు, NBFCలు పోటాపోటీగా ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.

వ్యక్తిగత రుణాలతో పోల్చితే బంగారు రుణాలు తక్కువ వడ్డీ, వేగవంతమైన డిస్బర్సల్, తక్కువ డాక్యుమెంటేషన్ కారణంగా ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే కేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు. ప్రాసెసింగ్ ఫీజు, టెన్యూర్, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, లోన్ టు వ్యాలు (LTV) నిష్పత్తి వంటి అంశాలు కూడా మొత్తం రుణ వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 2026లో సాధారణంగా బ్యాంకుల గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.3 శాతం నుంచి 10.5 శాతం మధ్యలో కొనసాగుతున్నాయి. ప్రత్యేక పథకాలు, పండుగ ఆఫర్లలో కొన్ని బ్యాంకులు 8 శాతం కంటే తక్కువ రేట్లను కూడా ప్రకటించాయి. అయితే ఈ రేట్లు గోల్డ్ నాణ్యత, రుణ పరిమాణం, కస్టమర్ ప్రొఫైల్, రీపేమెంట్ చరిత్రపై ఆధారపడి మారుతున్నాయి.

తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల 2026 లో ర్యాంకింగ్ : 

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (PSU Banks) బంగారు రుణాల్లో తక్కువ వడ్డీని అందించడంలో ముందంజలో ఉన్నాయి. వీటిలో South Indian Bank, Bank of India, Indian Bank, State Bank of India (SBI) వంటి సంస్థలు పోటీ రేట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. South Indian Bank సాధారణంగా 8.3 శాతం నుంచి 8.5 శాతం పరిధిలో వడ్డీ రేట్లను అందిస్తూ ముందువరుసలో కనిపిస్తోంది. తరువాత Bank of India 8.35 శాతం నుంచి 9.05 శాతం మధ్యలో రేట్లు ప్రకటిస్తోంది. Indian Bank, SBI, Union Bank of India వంటి బ్యాంకులు కూడా 8.7 శాతం నుంచి 10 శాతం పరిధిలో ఆకర్షణీయ రేట్లు అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి :  Gold & Silver Prices Today: సామాన్యుడికి అందని లోహాలు.!

ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే, ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank వంటి సంస్థలు 9 శాతం పైబడిన వడ్డీతో మార్కెట్లో కొనసాగుతున్నాయి. అయితే వీటి ప్రత్యేకత వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన కస్టమర్ సర్వీస్, డిజిటల్ లోన్ సౌకర్యాలు.

NBFCలు (ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటివి) తక్షణ డిస్బర్సల్‌లో ముందున్నప్పటికీ, వాటి వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 15 శాతం వరకు ఉండటం సాధారణం. అందుకే తక్కువ ఖర్చుతో రుణం కోరుకునే వినియోగదారులు ఎక్కువగా బ్యాంకులనే ఎంచుకుంటున్నారు.

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు ఎంపిక కీలక..

బంగారు రుణం తీసుకునే ముందు వినియోగదారులు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. మొదటిది వడ్డీ రేటు మాత్రమే కాదు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ చూపించి, ఎక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలు విధించే అవకాశం ఉంది. రెండవది Loan to Value (LTV) నిష్పత్తి. సాధారణంగా బ్యాంకులు బంగారం విలువలో 75 శాతం వరకు రుణం ఇస్తున్నాయి. ఎక్కువ LTV కావాలంటే వడ్డీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది టెన్యూర్. స్వల్పకాలిక రుణాలకు సాధారణంగా తక్కువ వడ్డీ ఉంటుంది. దీర్ఘకాలిక రుణాల్లో మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది.

నాలుగవది గోల్డ్ నాణ్యత. 22 క్యారెట్ లేదా 24 క్యారెట్ బంగారానికి ఎక్కువ విలువ లభిస్తుంది, దాంతో ఎక్కువ రుణ పరిమాణం పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా 2026లో గోల్డ్ లోన్ మార్కెట్ వినియోగదారులకు అనుకూలంగా మారుతోంది. పోటీ పెరగడంతో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తూ, సేవలను మెరుగుపరుస్తున్నాయి. అయితే సరైన బ్యాంకు ఎంపిక, సమగ్ర అవగాహన, జాగ్రత్తగానూ నిర్ణయం తీసుకోవడం వినియోగదారుల చేతిలోనే ఉంది.

ఇది కూడా చదవండి :  Gold and silver prices – full details | బంగారం , వెండి ధరలు – పూర్తి వివరాలు, ధరలు ఎలా నిర్ణయిస్తారు?
Best gold loan banks 2026 with lowest interest rates comparison.
2026 Gold Loan Interest Rates – Best Banks Comparison

గోల్డ్ లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీ కోసం చూస్తున్నవారికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అత్యంత విశ్వసనీయ ఉంటాయని చెప్పుకోవచ్చు. గోల్డ్ లోన్ ఎంపికలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎంపిక చేసుకోవడం ఒక కీలక అంశం. కేవలం వడ్డీ కాకుండా మొత్తం రుణ వ్యయాన్ని పరిశీలిస్తేనే నిజమైన లాభం లభిస్తుంది. సరైన ప్లానింగ్‌తో వినియోగదారులు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా బంగారు రుణం పొందే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో గోల్డ్ లోన్ తీసుకుని సరైన క్రమంలో ఈఎంఐలు చెల్లిస్తే లోన్ అమౌంట్ మరింత పెరికి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Author: QAMAR SD , Vaasthava Nestham Editorial Team , Published on : January 19,2025 | 2:07 PM

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page