📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessToday Gold Price Updates | బంగారం ధరల్లో భారీ మార్పు – హైదరాబాద్‌లో కొత్త...

Today Gold Price Updates | బంగారం ధరల్లో భారీ మార్పు – హైదరాబాద్‌లో కొత్త రేట్లు ఇలా..

Hyderabad Gold Price Update: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి సర్ప్రైజ్ ఎదురైంది. ఇటీవల వరుసగా తగ్గిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో గోల్డ్‌ పై డిమాండ్ మళ్లీ పెరుగుతుండటమే దీని ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

22K Gold price | 22 క్యారెట్ల బంగారం ధర : 

భారతదేశంలో బంగారం కొనుగోలు సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు – ఎప్పుడు అయినా బంగారమే ప్రాధాన్యం. మహిళలు ఆభరణాల రూపంలో గోల్డ్ కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపుతారు. పెళ్లిళ్ల సమయంలో బంగారం ప్రతిష్ఠకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటివి గోల్డ్ ధరను పెంచాయి. పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని సురక్షిత ఆస్తిగా చూస్తున్నారు. దీంతో గత నెలలో బంగారం ధరలు జీవిత కాల గరిష్టాలను తాకాయి.

ధరల్లో తగ్గుదల తర్వాత పెరుగుదల : 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశ వార్తల తరువాత గోల్డ్ ధరలు కొంతకాలం పతనమయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా పసిడి ధరలు వరుసగా 10 రోజులకుపైగా తగ్గాయి. ఆ సమయంలో తులం ధర దాదాపు రూ.10,000 వరకు పడిపోయింది. అయితే గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (Us federal reserve) ఈ ఏడాదిలో రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడం ధరల పెరుగుదలకు దారితీసింది.

Gold price in Hyderabad | హైదరాబాద్‌ లో తాజా గోల్డ్ రేట్లు : 

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,650 పెరిగి తులం రూ.1,13,000కి చేరుకుంది. దీనికి ముందురోజు మాత్రం రూ.850 తగ్గింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,23,280గా ఉంది. దీనికి ముందురోజు ఇది రూ.920 వరకు పడిపోయింది.

బంగారం ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ రేటు, మరియు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలపై ఆధారపడి మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలర్స్ వద్ద తాజా రేట్లను నిర్ధారించుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page