వాస్త నేస్తం,డెస్క్,ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించింది. వారి మేలు కోసం ప్రత్యేక సంక్షేమ, అభి వృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుంది. తాజాగా ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’కి శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈసారి పంపిణీ విధానాన్ని పూర్తి పార దర్శకంగా, గ్రామాల వరకు చేరుకునేలా రూపొందిం చారు. సెర్ప్ ఆధ్వర్యంలో రూపొందించిన సూచనల ప్రకారం… జిల్లా, మండల స్థాయి కార్యక్రమాల అనంత రం మహిళా సంఘాల బృందాలు నేరుగా ఇంటింటికీ వెళ్లి చీరలను అందించనున్నారు. ప్రతి మండలాన్ని పర్య వేక్షించేందుకు సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవోను బాధ్యులు గా నియమించారు. మంత్రి సీతక్క సూచనలతో మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఇంటికెళ్లి ప్రతీ మహిళకు బొట్టు పెట్టి గౌరవంగా చీరను అందజేయ డం తప్పనిసరి చేశారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలు. అక్రమాలు చోటుచేసుకో కుండా, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఆధార్ ధృవీకరణ వ్యవస్థను ఉపయో గిస్తున్నారు. పెన్షనర్ల ధృవీకరణకు ఉపయోగిస్తున్న మొబైల్ యాప్‌ను ఈ పంపిణీలోనూ వినియోగిస్తారు. మహిళ చీర పొందిన వెంటనే ఆమె ఫొటోను యాప్ లో నమోదు చేసిన తర్వాత మాత్రమే చీరను అంద జేయాలి. సంఘానికి సభ్యురాలు కానివారు చీర తీసుకోవాలనుకుంటే, ముందుగా సభ్యత్వం నమోదు చేసి తర్వాతే పంపిణీ చేస్తారు. ప్రత రోజూ పంపిణీ పురోగతిపై కలెక్టర్లు సెర్ప్‌కు రిపోర్ట్ అందించాలి.
15 – 18 ఏళ్ల యువతుల కోసం..
15 నుంచి 18 ఏళ్ల యువతులకు ప్రత్యేకంగా సల్వార్ కమీజ్‌లు లేదా లంగావోణీలు అందించాలనే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనుమతి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం వెల్లడించనుంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల శక్తిని ఒకే వేదికపైకి తెచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లో పురపాలక ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఈ విలీనంతో గ్రామీణ, పట్టణ మహిళా సంఘాల మధ్య సమన్వయం పెరిగి, స్త్రీ సాధికారత కార్యక్రమాలు మరింత వేగం అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

