• డచ్ క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు బలి..
• 23 దేశాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రపంచాన్ని మరోసారి వైరస్ భయం వణికిస్తోంది. కోవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, తాజాగా మరో ప్రమాదకరమైన మహమ్మారి ముంచుకొస్తోంది. శరవేగంగా వ్యాపిస్తున్న ‘హంతా వైరస్’ (Hantavirus) పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైనదని స్పష్టం చేస్తూ, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.
గురువారం ఓ డచ్ క్రూయిజ్ షిప్‌లో ఈ హంతా వైరస్ తీవ్ర కలకలం రేపింది. ఈ నౌకలో వైరస్ బారిన పడి ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రూయిజ్ షిప్‌లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు ఒకే చోట ఉండటంతో, వారి ద్వారా ఆయా దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
హంతా వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుంబిగించింది. క్రూయిజ్ షిప్‌లో ఉన్న ప్రయాణికుల వివరాలను సేకరించి, ఆయా 23 దేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. వైరస్ నివారణ మరియు నియంత్రణ కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తక్షణమే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
