📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
HomeGovt Schemesదివ్యాంగులకు గుడ్ న్యూస్ : OBMMS ద్వారా ఉచిత ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు… ఫిబ్రవరి 10లోపు దరఖాస్తు

దివ్యాంగులకు గుడ్ న్యూస్ : OBMMS ద్వారా ఉచిత ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు… ఫిబ్రవరి 10లోపు దరఖాస్తు

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు మళ్లీ దివ్యాంగుల సంక్షేమం కోసం, OBMMS (Online Beneficiary Management and Monitoring System) పోర్టల్ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా సహాయ పరికరాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 2026 ఫిబ్రవరి 10 చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా, దివ్యాంగుల విద్య, ఉపాధి మరియు రోజువారీ జీవితం మరింత సులభంగా మారేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

OBMMS అంటే ఏమిటి.?

OBMMS అనేది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి, ప్రయోజనాలను పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్. ఈ విధానం ద్వారా దివ్యాంగులు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది. దీంతో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు వారి నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని వస్తువులు అందజేయనుంది.

ఉచితంగా అందించే సహాయ పరికరాలు 

ఈ పథకం కింద దివ్యాంగులకు అవసరమైన పలు రకాల ఆధునిక పరికరాలను ఉచితంగా అందిస్తున్నారు. వాటిలో: బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్‌చైర్లు, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్‌ఫోన్‌లు, వినికిడి యంత్రాలు, సాధారణ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, చేతి కర్రలు, చంక కర్రలు, స్మార్ట్ కేన్‌లు ఈ పరికరాలు దివ్యాంగుల స్వావలంబనకు, ఉపాధి అవకాశాల పెంపుకు దోహదపడతాయి. దీంతో దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి :  Farmer Registration | రైతుకు డిజిటల్ గుర్తింపు… పథకాలన్నీ ఒకే దారిలోకి: ‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయం

అర్హతలు ఏమిటి : ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కులం, మతం, లింగ భేదం లేకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మోటరైజ్డ్ వాహనాలకు SC/ST లేదా మహిళా దివ్యాంగులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు విధానం : అర్హులైన దివ్యాంగులు OBMMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త వినియోగదారులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అనంతరం లాగిన్ అయి వ్యక్తిగత వివరాలు, దివ్యాంగత సమాచారం, అవసరమైన పరికరాల ఎంపికను నమోదు చేయాలి. చివరగా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.

అవసరమైన పత్రాలు : ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ లేదా మీసేవ ఆదాయ నంబర్ ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 10, 2026 , చివరి తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన వారు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే తమ వివరాల్లో మార్పులు ఉంటే OBMMS పోర్టల్‌లో లాగిన్ అయి అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దివ్యాంగుల స్వావలంబనకు ఈ పథకం కీలక అడుగుగా నిలుస్తోంది. ఉచితంగా ఆధునిక పరికరాలు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో దరఖాస్తు చేసుకుంటే, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి :  Rythu Bharosa Scheme : రైతు భరోసా నిలిపివేత నిజమా.?

Note: Images used in this article are generated by AI for representation purposes.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page