HomeBreaking Newsవాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్‌చల్...

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్‌చల్…

• పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులు.. భయాందోళనలో స్థానికులు

• మాటల్లో పెట్టి సురక్షితంగా కిందకు దించిన పోలీసులు, కుటుంబ సభ్యులు

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ మహిళ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తానంటూ హల్‌చల్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఇచ్చోడ మండల కేంద్రంలోని భీమన్నగుట్ట వద్ద ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఓ మహిళ అకస్మాత్తుగా ఎక్కింది. పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ కేకలు వేస్తూ బెదిరింపులకు దిగింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై, ఎక్కడ ఆమె కిందకు దూకేస్తుందోనని భయపడి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, సదరు మహిళ కొంత మతిస్థిమితం కోల్పోయి ఈ విధంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక సమాచారం.

స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వెంటనే సదరు మహిళ కుటుంబ సభ్యులను కూడా అక్కడికి రప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకవద్దంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో నేర్పుగా ఆమెను మాటల్లో పెట్టి, నెమ్మదిగా సముదాయించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర ప్రయత్నాలు ఫలించి చివరకు ఆ మహిళను సురక్షితంగా కిందకు దించారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సకాలంలో స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular