HomeTelanganaUpi charges | యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ పెంపు దారుణం

Upi charges | యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ పెంపు దారుణం

📰 Generate e-Paper Clip

• సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం నిర్ణయం

• తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి బొజ్జ రవి

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొజ్జ రవి పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యుడి నడ్డి విరిగే పరిస్థితి దాపురించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోన్‌పే, గూగుల్‌పే తదితర సాంకేతిక యాప్‌ల ద్వారా ఒక్క రూపాయి కూడా ట్రాన్స్‌ఫర్ చేయలేని దుస్థితికి కేంద్రం సామాన్యులను నెట్టివేసిందని మండిపడ్డారు. కేంద్రం విధించిన ఈ కొత్త ‘బాదుడు’ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోందని విమర్శించారు. చిరు వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాల నిర్వాహకులపై ఈ నిర్ణయం మోయలేని అదనపు వ్యయ భారాన్ని మోపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, యూపీఐ చెల్లింపులపై తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular