HomePolitical Newsఉపసర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడిగా బద్దం రామచంద్రారెడ్డి

ఉపసర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడిగా బద్దం రామచంద్రారెడ్డి

• జిల్లా కేంద్రంలో ఘనంగా నూతన కార్యవర్గ ఎన్నిక

• ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి మెరుగు జంపన్న

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా ఆడేగాం(కే) ఉపసర్పంచ్ బద్దం రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మెరుగు జంపన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షుల సమక్షంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఫోరమ్ జిల్లా పగ్గాలను బద్దం రామచంద్రారెడ్డికి అప్పగించిన అనంతరం, మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మర్లపెల్లి ఉపసర్పంచ్ తలంపుల రమేష్, ఉపాధ్యక్షులుగా అరుణ్ రెడ్డి (కూచులాపూర్), జాదవ్ అజయ్ (సుంకిడి), చౌహాన్ రాహుల్ (చిచ్చుదరి) ఎన్నికయ్యారు. కోశాధికారిగా టాక్రె సాగర్ (చెప్రాల), అలాగే కార్యదర్శులుగా కొత్తపల్లి ఆడేళ్లు (మావల), మంత్రి గంగారెడ్డి (తాంసి), గైక్వాడ్ గణేష్ (ధాబా-కే), మోబిన్ (దంతానపల్లి) లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా తోకల రాజు (సిరికొండ), పుండ్రు విజయ (బోథ్), రియాజ్ (బజార్‌హత్నూర్), నీలేష్ రెడ్డి (పొచ్చెరా), సాయి చరణ్ రెడ్డి (బోరిగామ), శ్రీకాంత్ రెడ్డి (వార్తమన్నూర్), బాగోజీ సాగర్ (కొబ్బయి) తదితర ఉపసర్పంచులను ఎన్నుకోవడం జరిగింది.

ఉపసర్పంచుల హక్కుల సాధనకే మా కృషి..

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు బద్దం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఫోరమ్ తరపున సమష్టిగా, నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నూతన కార్యవర్గానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందనలుతెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular