• పార్టీ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని వెల్లడి
• డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కృతజ్ఞతలు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధికార ప్రతినిధిగా(స్పోక్స్‌పర్సన్) బొజ్జ రవి నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు ఆయన ఒక ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన డీసీసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, ఇచ్చోడ మండల అధ్యక్షులు కళ్లెం నారాయణరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తనకు అప్పగించిన అధికార ప్రతినిధి బాధ్యతను పూర్తి నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తానని బొజ్జ రవి స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్