HomeWeather Newsఆదిలాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన.. ఇచ్చోడలో అత్యధికంగా వర్షపాతం నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన.. ఇచ్చోడలో అత్యధికంగా వర్షపాతం నమోదు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

ముఖ్యంగా ఇచ్చోడ మండల కేంద్రంలో వాన దంచికొట్టింది. కేవలం ఆరున్నర గంటల వ్యవధిలోనే జిల్లాలోనే అత్యధికంగా ఇచ్చోడలో 77.8 మిల్లీమీటర్ల ‘భారీ వర్షపాతం’ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్‌లో 63.8 మి.మీ, బజార్‌హత్నూర్‌లో 63.3 మి.మీ, తలమడుగు మండలంలోని భారంపూర్‌లో 60.5 మి.మీ చొప్పున మోస్తరు వర్షపాతం నమోదైంది.

ఇతర మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు (మి.మీ లలో):

బేల (చప్రాల) – 47.0

నేరడిగొండ – 46.3

గుడిహత్నూర్ – 46.0

బోథ్ (పోచర) – 44.3

ఆదిలాబాద్ అర్బన్ – 32.8

సోనాల – 32.5

జైనథ్ – 32.5

ఉదయం నుంచి కురుస్తున్న ఈ వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండటం మరియు వానాకాలం పంటలకు ఈ వర్షాలు ఎంతో అనుకూలంగా ఉండటంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular