• ఆమె సేవలు చిరస్మరణీయం: కరస్పాండెంట్ సురకంటి వనమాల
• రెండు నిమిషాలు మౌనం పాటించిన ఉపాధ్యాయ బృందం
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలోని స్థానిక ప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి అకాల మృతి పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేసింది. పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ సురకంటి వనమాల ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ప్రిన్సిపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ సురకంటి వనమాల మాట్లాడుతూ.. రూపారెడ్డి విద్యారంగానికి అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె చూపిన అంకితభావం ఆదర్శనీయమని, ఆమె మరణం పాఠశాలకు, విద్యా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, నిజామోద్దీన్, పీఈటీ అల్లం సాయికిరణ్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్