- 150 మంది పోలీసులతో తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు
- ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న 15 బైక్‌లపై కేసులు నమోదు
- చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపుర గ్రామంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామంలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఫేక్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ లేని 15 ద్విచక్ర వాహనాలపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
- గంజాయి రహిత జిల్లా: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని.. గంజాయి వాడకం, నిల్వ, రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నేరం: ప్రభుత్వ రాయితీ (PDS) బియ్యాన్ని కొనుగోలు చేసినా, అక్రమంగా నిల్వ లేదా రవాణా చేసినా కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.
- భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులు, కాలనీవాసులు సమన్వయంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- రోడ్డు భద్రత నిబంధనలు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.

Adilabad police personnel conducting a community contact program and vehicle inspection in Ichoda.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
