e-paper
Wednesday, December 17, 2025
HomeAndhra PradeshCyclone Montha : మొంథా ముప్పు.. కాకినాడ వ‌ద్ద తీరం దాటే అవ‌కాశం

Cyclone Montha : మొంథా ముప్పు.. కాకినాడ వ‌ద్ద తీరం దాటే అవ‌కాశం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా క‌దిలి (Cyclone Montha)తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాత్రిలోపు ప‌శ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మార‌నుంద‌ని తెలిపింది. ఈ మొంథా తుఫాను మ‌చిలీప‌ట్నం- క‌లింగ‌ప‌ట్నం మ‌ధ్య కాకినాడ స‌మీపంలో ఎల్లుండి (మంగ‌ళ‌వారం) తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యంలో గంట‌కు 90-110 కి. మీ వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు ముందస్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page