వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: బంగారం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్న ఈ సమయంలో చాలా మందిలో ఒకే ఒక్క భయం—ఇప్పుడే బంగారం కొంటే లాభమా..? లేక ధరలు పడిపోతాయా..?
2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, పెళ్లిళ్లు, పండుగలు, భవిష్యత్ భద్రత కోసం బంగారంపై ఆశ పెట్టుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రశ్న చాలా కీలకంగా మారింది.
గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు పెరగడంతో కొందరు కొనుగోలు వాయిదా వేస్తున్నారు. మరోవైపు “ఇప్పుడే కొనకపోతే తర్వాత మరింత ఖరీదవుతుందేమో” అన్న భయం కూడా వెంటాడుతోంది. ఈ అయోమయ పరిస్థితుల్లో బంగారం నిజంగా 2026లో సురక్షిత పెట్టుబడేనా అనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
2026లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?
బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రస్తుతం బలమైన సంకేతాలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు, డాలర్ బలహీనత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. all these factors కలిసి బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయి.
ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగిన ప్రతిసారి పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీస్తున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ రిజర్వుల్లో బంగారాన్ని పెంచుకుంటుండటం ధరలకు బలమైన ఆధారం.
అందుకే 2026లో బంగారం ధరలు భారీగా కూలిపోతాయన్న అంచనాలు ప్రస్తుతం మార్కెట్‌లో బలంగా లేవు.
2026లో Gold Investment చేయాలా? ఎవరికీ ఇది సరైన నిర్ణయం?
దీర్ఘకాలికంగా ఆలోచించే వారికి 2026లో కూడా Gold Investment ఒక సురక్షిత ఎంపికగానే కనిపిస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు, ఆర్థిక భద్రత కోసం ప్లాన్ చేసే వారికి బంగారం రక్షణ కవచంలా పనిచేస్తుంది.

అయితే మొత్తం పొదుపును బంగారంలో పెట్టడం కన్నా, కొంత భాగాన్ని మాత్రమే కేటాయించడం మంచిది. ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉండటంతో విడతలుగా కొనుగోలు చేయడం బుద్ధిమంతమైన నిర్ణయం. ఫిజికల్ గోల్డ్‌తో పాటు గోల్డ్ ETFలు లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి మార్గాలు కూడా పరిశీలిస్తే రిస్క్ తగ్గుతుంది.
మొత్తానికి 2026లో Gold Investment Safe ఆ..? అనే ప్రశ్నకు సమాధానం భయంతో కాదు.. సరైన ప్లాన్‌తో అడుగు వేస్తే బంగారం ఇప్పటికీ నమ్మదగిన పెట్టుబడిగానే ఉంటుంది.
Author: Qamar SD , Vaasthava Nestham

