📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessGold Price 2026: అంచనాలన్నీ తలకిందులు.. 2026 దీపావళి నాటికి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా...

Gold Price 2026: అంచనాలన్నీ తలకిందులు.. 2026 దీపావళి నాటికి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయంటే..!

నేరుగా విషయానికి వస్తే… 2026లో అయినా బంగారం, వెండి ధరలు తగ్గుతాయా.? లేదా ఇప్పటిలాగే మరింత పెరుగుతాయా? ప్రస్తుతం ఇండియాలో ఇన్వెస్టర్లను వేధిస్తున్న బిగ్గెస్ట్ డౌట్ ఇదే. రేట్లు పడతాయన్న వార్తలు వినిపిస్తున్నా… వాస్తవంలో మాత్రం
బంగారం, వెండి రెండూ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. 2025 ప్రారంభంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ.78 వేలు కాగా, ఇప్పటికే లక్షా 38 వేల మార్క్‌ను దాటింది. వెండి అయితే బంగారంతో పోటీ పడుతూ లక్షల్లో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో 2026లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది. ఇంట్రస్టింగ్‌గా మారింది.

Gold Price Trend 2026 | 2026లో బంగారం దిశ ఏంటి.?

2025లో గోల్డ్ రేట్లు ఇంతగా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ఏడాది ప్రారంభంతో పోలిస్తే డిసెంబర్ చివరి నాటికి బంగారం ధర దాదాపు రూ.45 వేల వరకు పెరిగింది. ఈ రికార్డు స్థాయి ధరలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తీసుకొచ్చాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026లోనూ బంగారం జోరు తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల
గోల్డ్ కొనుగోళ్లు ధరలకు మద్దతు ఇస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం 2026 దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్షా 60 వేల నుంచి లక్షా 80 వేల దాకా వెళ్లే అవకాశం ఉంది.

Global Economy Impact | గ్లోబల్ మార్కెట్ షాక్ ప్రభావం

గోల్డ్‌మన్ సాచ్స్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వంటి సంస్థల అంచనాల ప్రకారం 2026లో బంగారం ధర మరో 15 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ సంక్షోభం, క్యాష్ కొరత వంటి భయాలు ఇన్వెస్టర్లను గోల్డ్ వైపు నడిపిస్తున్నాయి. డాలర్ విలువ బలహీనపడితే బంగారం ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలపై చర్చలు బంగారానికి మరింత బలం ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్, కరెన్సీ మార్కెట్లకు షాక్ తగలొచ్చన్న భయాలు కూడా గోల్డ్ డిమాండ్‌ను పెంచుతున్నాయి.

Silver Price Forecast 2026 | వెండి ఎందుకు దూసుకెళ్తోంది.?

వెండి విషయంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్లలో వెండి ధర 170 శాతం వరకు పెరిగింది. ఇండియాలో కిలో వెండి ధర రూ.2.5 లక్షల మార్క్‌ను దాటేసింది.

వెండికి ఇప్పుడు కేవలం ఆభరణాల డిమాండ్ మాత్రమే కాదు.
సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో ఇండస్ట్రియల్ డిమాండ్ భారీగా పెరిగింది. కొత్త మైనింగ్ గనులు రాకపోవడంతో సప్లై తగ్గి.. డిమాండ్ పెరగడం వెండికి పెద్ద ప్లస్‌గా మారింది. 2026లో కిలో వెండి ధర రూ.3 లక్షల దాకా వెళ్లే అవకాశం ఉందని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Investment Strategy 2026 | 2026లో ఏది బెస్ట్ పెట్టుబడి.?

మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు బంగారాన్ని ఎంచుకోవడం మంచిది. ఇది వెండి కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. అయితే ఎక్కువ లాభాలు ఆశించే, కొంత రిస్క్ తీసుకోగలిగే వారికి వెండి మంచి ఎంపికగా మారుతోంది. మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా, పెట్టుబడిలో 20–30 శాతం బంగారానికి, 10–15 శాతం వెండికి కేటాయించడం ఉత్తమ వ్యూహమని నిపుణులు సూచిస్తున్నారు.
నగలు కాకుండా డిజిటల్ గోల్డ్, గోల్డ్ & సిల్వర్ ETFలు, సార్వభౌమ గోల్డ్ బాండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం
సామాన్యులకు సురక్షిత మార్గంగా మారింది.


గమనిక: పై అంచనాలు మార్కెట్ నిపుణుల విశ్లేషణల ఆధారంగా రూపొందించబడినవి. బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు. పెట్టుబడి పెట్టేముందు స్వంత ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవడం అవసరం.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page