HomeBusinessప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల

ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: గోల్డ్ ప్రియులకు ఈ వారం బంగారం రేట్లు ఆశ్చర్యం కలిగించాయి. అమెరికా–వెనిజులా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తూ, బంగారం మరియు వెండి ధరలను ఒక్కసారిగా పెంచాయి. ఇటీవల హాల్‌టైం హైకి చేరిన బంగారం ధరలు కొద్ది రోజుల గరిష్ట స్థాయికి చేరాయి.

గత రెండు రోజుల్లో కొంచెం తగ్గిన బంగారం ధరలు, అమెరికా వెనిజులాపై చర్యల తర్వాత మళ్లీ పెరుగుతూ, దేశీయ మార్కెట్లలో గరిష్ట ప్రభావాన్ని చూపాయి. ఒకరోజులోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,000 పెరిగి, వెండి ధర రూ.6,000 పెరిగినట్లు పరిశీలించవచ్చు.

సోమవారం ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,810గా ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటలకు రూ.1,37,400కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,24,490 నుండి 1,25,950కు చేరింది. దేశ వ్యాప్తంగా ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,37,400గా కొనసాగుతోంది. చెన్నైలో రూ.1,38,330, ఢిల్లీలో రూ.1,37,550కు చేరింది.

వెండి ధర కూడా భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,40,000 వద్ద ప్రారంభమై, ప్రస్తుతానికి రూ.2,47,000కు చేరింది.

బంగారం మరియు వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం: వెనిజులాపై అమెరికా దాడి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ముడి చమురు, బంగారం మరియు వెండి మార్కెట్లలో పెట్టుబడుల ఊగిసలాట. నిపుణుల ప్రకారం, ఈ పరిస్థితులు విలువైన లోహాలు, రాగి వంటి వస్తువుల ధరలను మరింత పెంచే అవకాశం కలిగిస్తున్నాయి.

– Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular