వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ఇన్ని రోజులూ ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో ఇప్పుడు డౌన్‌ఫాల్ మొదలైంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన బంగారం రేట్లు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి.
ఈ తగ్గుదల వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. నేటి ధరలు కూడా కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా
ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగొచ్చని చెబుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :
| నగరం | 24 క్యారెట్లు (₹) | 22 క్యారెట్లు (₹) |
|---|---|---|
| ఢిల్లీ | 1,35,570 | 1,24,273 |
| ముంబై | 1,35,800 | 1,24,483 |
| కోల్‌కతా | 1,35,620 | 1,24,318 |
| చెన్నై | 1,36,200 | 1,24,850 |
| బెంగళూరు | 1,35,910 | 1,24,584 |
| హైదరాబాద్ | 1,36,020 | 1,24,685 |
ఇక వెండి ధరలను పరిశీలిస్తే, కిలో వెండి రేట్లు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో 999 స్వచ్ఛత కలిగిన వెండి ధరలు ఇలా ఉన్నాయి :
| నగరం | కిలో వెండి ధర (₹) |
|---|---|
| ఢిల్లీ | 2,33,340 |
| ముంబై | 2,33,750 |
| కోల్‌కతా | 2,33,440 |
| చెన్నై | 2,34,430 |
| బెంగళూరు | 2,33,930 |
| హైదరాబాద్ | 2,34,120 |
ప్రధాన నగరాల్లో గ్రాముకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :
| నగరం | 24 క్యారెట్లు (₹) | 22 క్యారెట్లు (₹) | 18 క్యారెట్లు (₹) |
|---|---|---|---|
| చెన్నై | 13,691 | 12,550 | 10,470 |
| ముంబై | 13,588 | 12,455 | 10,191 |
| బెంగళూరు | 13,620 | 12,485 | 10,193 |

గమనిక: పై ధరలు ఉదయం సమయంలో ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగా ఇవ్వబడ్డాయి. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు కలిపితే ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని బంగారం వ్యాపారులను సంప్రదించడం మంచిది.

