📄 ePaper
Friday, February 20, 2026
📄 ePaper
HomeBusinessGold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? ఇవే తాజా గోల్డ్ & సిల్వర్ ధరలు

Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? ఇవే తాజా గోల్డ్ & సిల్వర్ ధరలు

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి. అమెరికా – వెనిజులా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అంశాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.

ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. అదే ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి.

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు

ఈరోజు దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,230గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,26,710గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,03,680గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం & వెండి ధరలు

నగరం 24 క్యారెట్లు (10 గ్రా.) 22 క్యారెట్లు (10 గ్రా.) వెండి (కిలో)
చెన్నై రూ.1,39,210 రూ.1,27,610 రూ.2,66,100
ముంబై రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,48,100
ఢిల్లీ రూ.1,38,380 రూ.1,26,860 రూ.2,48,100
కోల్‌కతా రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,48,100
బెంగళూరు రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,48,100

తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలు

నగరం 24 క్యారెట్లు (10 గ్రా.) 22 క్యారెట్లు (10 గ్రా.) వెండి (కిలో)
హైదరాబాద్ రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,65,100
విజయవాడ రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,65,100
విశాఖపట్నం రూ.1,38,230 రూ.1,26,710 రూ.2,65,100
ఇది కూడా చదవండి :  Silver | భారీగా పెరిగిన వెండి ధరలు.. దివాలా వెండి వ్యాపారులు.!
Gold rates today in India with silver prices across major cities
Gold and silver prices surge in India amid global uncertainty and strong investor demand.

గమనిక: ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ మార్పుల కారణంగా ధరలు రోజంతా మారే అవకాశం ఉంటుంది.

– Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page