HomeTelanganaఇచ్చోడ నూతన ఎస్‌హెచ్‌ఓగా ప్రవీణ్ కుమార్

ఇచ్చోడ నూతన ఎస్‌హెచ్‌ఓగా ప్రవీణ్ కుమార్

• హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి బదిలీ

• మల్టీ జోన్–1కు బదిలీపై వెళ్లిన మాజీ సీఐ నరేష్

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓ (Station House Officer) గా ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఉన్నతాధికారులు ఇటీవల బదిలీ చేయడంతో ఇక్కడ పోస్టింగ్ దక్కింది. కాగా, ఇప్పటివరకు ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓగా సేవలందించిన నరేష్.. మల్టీ జోన్-1 కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేస్తామని, నిరంతరం అందుబాటులో ఉంటూ బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అంతకుముందు, పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నూతన ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్‌కు స్థానిక ఎస్సైలు, పోలీస్ సిబ్బంది స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular