• ఇచ్చోడ జడ్పీహెచ్ఎస్ మైదానంలో కారు ప్రదర్శనపై స్థానికుల ఆరా
• సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. అనుమతులపై చర్చ
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, ఓ ప్రైవేట్ కార్ల సంస్థ ప్రచారానికి వేదికైందా? అన్న చర్చ ప్రస్తుతం ఇచ్చోడ మండలంలో జోరుగా సాగుతోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓ కొత్త కారు లాంచింగ్, ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లుగా భావిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. విద్యార్థులు ఆటలు ఆడుకోవాల్సిన పాఠశాల మైదానంలో కార్లను ప్రదర్శించడంపై స్థానికులు, విద్యాభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల మైదానంలో ఓ కార్ల షోరూం ప్రతినిధులతో కలిసి పాఠశాల సిబ్బంది ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలువురు సిబ్బంది పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను ప్రైవేట్ సంస్థల వాణిజ్య ప్రచార కార్యక్రమాలకు వినియోగించేందుకు అనుమతి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇది ఏదైనా అవగాహన కార్యక్రమం అయితే, దీనికి విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తీసుకున్నారా? లేక పాఠశాల స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల బోధనకు గానీ, క్రీడా సమయానికి గానీ ఏమైనా ఆటంకం కలిగిందా అన్న కోణంలోనూ స్థానికులు ఆరా తీస్తున్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్