వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన యూనియన్ సమావేశంలో నాయకులు, కార్మికులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని, రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, జిల్లా కార్యదర్శి సిరా దేవేందర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన మధ్యాహ్న భోజన కార్మికులకు, జిల్లా మరియు మండల స్థాయి నాయకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పదవిని బాధ్యతగా స్వీకరించి మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనునిత్యం, ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ యూనియన్ పక్షాన పోరాడుతానని గంగయ్య ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య
0
2
