HomeTelanganaAdilabadవృత్తి గౌరవాన్ని కాపాడేలా జర్నలిస్టుల విధులు

వృత్తి గౌరవాన్ని కాపాడేలా జర్నలిస్టుల విధులు

• ఆదిలాబాద్‌లో జిల్లాలో రెండో విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

• జర్నలిస్టులకు డీపీఆర్వో విష్ణువర్ధన్ దిశానిర్దేశం

• ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజం: టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సమాజంలో అత్యంత కీలకమైన జర్నలిజం వృత్తిలో ఉన్నవారు తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకుంటూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండో విడత జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీపీఆర్వో చేతుల మీదుగా పాత్రికేయులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డీపీఆర్వో విష్ణువర్ధన్ మాట్లాడుతూ… పత్రికా రంగం పట్ల సమాజంలో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పాత్రికేయులు నైతిక విలువలతో కూడిన వార్తా సంకలనం చేయాలన్నారు. జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రవర్తించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజల ఆకాంక్షలే జర్నలిస్టుల ఊపిరి..

అనంతరం టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం శ్రమించడమే నిజమైన జర్నలిజం అని ఆయన ఉద్ఘాటించారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందించడం సంతోషకరమన్నారు. అక్కిడిటేషన్ కార్డులు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషించిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు నూకల దేవేందర్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అలీమ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు అన్వర్ తదితరులకు, జర్నలిస్టులు జాకీర్ , ఖదీర్ , ఖాజా మొయినుద్దీన్, ఇర్ఫాన్ పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular