📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadKurnool bus Accident : నిద్రలోనే సజీవ దహనం..!

Kurnool bus Accident : నిద్రలోనే సజీవ దహనం..!

• కర్నూలు సమీపంలో ప్రైవేట్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం

• కర్నూల్ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు సజీవ దహనం

• గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు, ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం

• ప్రమాదస్థలి మృతదేహాలకు వద్దే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు

• డీఎన్ఏ పరీక్షల రిపోర్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింత

వాస్తవ నేస్తం,హైదరాబాద్/కర్నూలు : కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు సజీవ దహనమ య్యారు. మృతి చెందిన వారి మృతదేహాలను వెలికితీశారు. కాని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, ఘటనా స్థలంలోనే వైద్య బృందాలు పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నాయి. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన తర్వాత, వాటి ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బంధువులు సంయమనం పాటించాలని ఆయన కోరారు, మరోవైపు, ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి కూడా సూపరింటెండెంట్ వివరాలు తెలిపారు. మొత్తం 12 మందికి ఆసుపత్రిలో వైద్యం అందించగా, స్వల్ప గాయాలైన 8 మందికి ప్రథమ చికిత్స చేసి దిశ్చార్జ్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వీరిలో ఒకరికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన వివరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రైవేట్ బస్సుల వేగ నియంత్రణ, భద్రతా చర్యలపై చర్చించేందుకు త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. శు క్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న (Kaveri travels)కావేరి ట్రావెల్స్ చెందిన ఓ ప్రైవేట్ బస్సు బైక్ ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దారుణ ఘటనలో బైకర్ శివశంకర్ తో సహా 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సులో నుంచి దూకడంతో ప్రయాణికుల కాళ్లు, తలకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన 11 మంది బాధితుల్లో ప్రస్తుతం నలుగురికి వైద్యం కొనసాగుతోంది. స్వల్ప గాయాలైన మరికొందరు ప్రాథమిక చికిత్స అనంతరం తమ స్వస్థలాలకు బయలుదేరారు.

ఇది కూడా చదవండి :  రూ.39 లక్షలమొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత

సీఎం(chief Minister) – పీఎం (Prime Minister)దిగ్భ్రాంతి : సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం హైదరాబాద్లో ప్రత్యేక helpline కూడా ఏర్పాటు చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీని ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page