• 20 కి.మీ వేగంతో పెనుగాలులు..
• ప్రకాశం జిల్లాలో విలయం!
దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ (Murasu Cyclone) తీవ్ర తుఫాన్ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర గలులతో తీరం దాటింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 3 తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఈ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ పూర్తిగా ముగిసింది. తీరం దాటే సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చగా, తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తుఫాన్ తీరం దాటే మారుతున్న సమయంలో తీర ప్రాంతంలో పెనుగాలులు వీచాయి. సాధారణంగా గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో వీచిన గాలులు, కొన్ని ప్రాంతాలలో గరిష్ఠంగా 120 కి.మీ వరకు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన ఈదురు గాలుల తాకితకి పలుచోట్ల చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, తీరం దాటిన తర్వాత ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడుతూ వాయువ్య దిశగా లోపలికి కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
భారీ వర్షాల ముప్పు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక:
మురసు తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అత్యధికంగా 164.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాగల కొన్ని గంటల పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్