📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeGovt SchemesPM Kisan 22nd Installment: కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు ₹2000 వస్తాయా? తాజా నిబంధనలు...

PM Kisan 22nd Installment: కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు ₹2000 వస్తాయా? తాజా నిబంధనలు ఇవే!

దేశంలోని రైతులందరికీ ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ ఈ పెట్టుబడి సహాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి కాకుండా, విడతకు రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

ఇప్పటికే 21 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి 22వ విడత (22nd Installment) పైనే ఉంది. అయితే, “ఇప్పుడే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఈ విడత డబ్బులు వస్తాయా?” అని చాలా మంది రైతులు సందేహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇక్కడ చదవండి.

కొత్త వారికి 22వ విడత డబ్బులు వస్తాయా?

కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కూడా 22వ విడత ప్రయోజనం పొందవచ్చు. కానీ, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏంటంటే

వెరిఫికేషన్ పూర్తి కావాలి: మీరు అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన డబ్బులు రావు. మీ వివరాలను అధికారులు పరిశీలించి, ఆమోదించి ఉండాలి (Approval).

భూమి మీ పేరు మీదే ఉండాలి: ఇది చాలా ముఖ్యమైన రూల్. సాగు భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ (Pattadar Passbook) ఖచ్చితంగా మీ పేరు మీదే ఉండాలి.

రికార్డులు సరిగ్గా ఉండాలి: మీరు సమర్పించిన ఆధార్, బ్యాంకు వివరాలు మరియు భూమి రికార్డుల్లో పేర్లు ఒకేలా ఉండాలి. ఎక్కడైనా తేడా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా 22వ విడత విడుదలయ్యే లోపు పూర్తయితే మీ ఖాతాలో కూడా రూ.2 వేలు జమ అవుతాయి.

ఇది కూడా చదవండి :  Farmer Registration | రైతుకు డిజిటల్ గుర్తింపు… పథకాలన్నీ ఒకే దారిలోకి: ‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయం

దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:

మీరు కొత్తగా ఈ పథకంలో చేరాలనుకున్న రైతులు, లేదా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి అవసరము :

1.ఆధార్ కార్డు (Aadhaar Card)

2.భూమి పాస్ బుక్ (Land Documents)

3.మీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా (Bank Account details)

4.మొబైల్ నంబర్ (ఆధార్ కు లింక్ అయి ఉండాలి)

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (సింపుల్ స్టెప్స్)..

రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా ఇలా అప్లై చేసుకోవచ్చు. ముందుగా PM Kisan అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) ఓపెన్ చేయండి. అందులో “New Farmer Registration” అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, రాష్ట్రం వివరాలు ఇచ్చి OTP వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీ భూమి వివరాలు (సర్వే నంబర్, విస్తీర్ణం) మరియు బ్యాంకు వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్లైన్ ప్రాసెస్ తెలియకపోతే, దగ్గర్లోని సీఎస్సీ (CSC) సెంటర్ లేదా మీ గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి కూడా నమోదు చేసుకోవచ్చు.

స్టేటస్ చెక్ చేసుకోండిలా..

మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్ లో “Beneficiary Status” ఆప్షన్ లోకి వెళ్ళండి. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలిసిపోతుంది.

ఇది కూడా చదవండి :  దివ్యాంగులకు గుడ్ న్యూస్ : OBMMS ద్వారా ఉచిత ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు… ఫిబ్రవరి 10లోపు దరఖాస్తు

ప్రభుత్వ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ ఉంటుంది కాబట్టి, రైతులు తమ e-KYC ని పూర్తి చేసుకోవడం మర్చిపోవద్దు. ఏది ఏమైనా అప్పటికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం తోని రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం రైతులకు ఆర్థిక భరోసానిస్తుంది.

Note: Images used in this article are generated by AI for representation purposes.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page