వాస్తవ నేస్తం ఆదిలాబాద్: పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఆదివారంతో విజయవంతంగా 279వ వారానికి చేరుకుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రస్ట్ సభ్యులు ప్రతి వారం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ , ప్రముఖ న్యాయవాది డాక్టర్ సుధీర్ కుమార్ సంగెం,ముందుకు తీసుకువెళ్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిమ్మ ప్రాథమిక ఆరోగ్య విస్తరణ అధికారి కాటిపెల్లి రాంరెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త కొండ భూమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా నిరాటంకంగా అన్నదానం చేస్తున్న సంగెం చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యుల సేవలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మహేందర్ రెడ్డి, సలీం, సుభాష్, అంబయ్య, టీఆర్సీ ఉద్యోగి గంగయ్య తదితరులు చురుకుగా పాల్గొన్నారు.
279వ వారానికి చేరిన సంగెం చారిటబుల్ ట్రస్ట్ అన్నదానం
0
15
Previous article
Next article
