వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఏ స్థాయికి చేరాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతిహాసంలో ఎప్పుడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగి రికార్డు స్థాయిలను తాకాయి.
ఒక్క ఏడాదిలోనే బంగారం ధర దాదాపు 60 శాతం వరకు పెరగడం మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.
అంత భారీగా ధరలు పెరిగినా కూడా బంగారం కొనుగోళ్లలో తగ్గుదల కనిపించడం లేదు. ఎందుకంటే బంగారం అనేది కేవలం ఆభరణాలు లేదా అలంకరణలకు మాత్రమే పరిమితం కాదు.
దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా నిలవాలంటే బంగారం నిల్వలు, ఉత్పత్తి చాలా ముఖ్యం.
అలాంటి విలువైన బంగారాన్ని ప్రపంచంలో ఏ దేశాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.2025 నాటి గ్లోబల్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశంగా మన పొరుగుదేశమైన చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనా సంవత్సరానికి సుమారు 380.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ రంగంలో చైనా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రెండో స్థానంలో రష్యా ఉంది.
రష్యా ఏటా సుమారు 330.0 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ బంగారం మార్కెట్‌పై రష్యా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
మూడో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది.
ఈ దేశం సంవత్సరానికి దాదాపు 284.0 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. విస్తారమైన మైనింగ్ ప్రాంతాలు ఆస్ట్రేలియాకు ప్రధాన బలం.
నాల్గవ స్థానంలో కెనడా ఉంది.
కెనడా ఏటా సుమారు 202.1 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. బంగారం మైనింగ్‌లో కెనడా స్థిరమైన ప్రగతిని చూపుతోంది.
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. అమెరికా సంవత్సరానికి సుమారు 158.0 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇందులో నెవాడా రాష్ట్రం ఒక్కటే దాదాపు 75 శాతం ఉత్పత్తిని అందించడం విశేషం.
ఆరవ స్థానంలో ఘనా ఉంది.
ఘనా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తి చేసే దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం ఏటా సుమారు 140.6 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది.
ఏడవ స్థానంలో మెక్సికో నిలిచింది.
మెక్సికో సంవత్సరానికి దాదాపు 140.3 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తోంది.
ఎనిమిదవ స్థానంలో ఇండోనేషియా ఉంది.
ఇండోనేషియా ఏటా సుమారు 140.1 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది.
తొమ్మిదవ స్థానంలో దక్షిణ అమెరికాకు చెందిన పెరూ ఉంది.
పెరూ సంవత్సరానికి దాదాపు 136.9 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తోంది.
చివరిగా పదవ స్థానంలో ఉజ్బెకిస్తాన్ నిలిచింది.
ఈ దేశం ఏటా సుమారు 129.1 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది.

మొత్తంగా చూస్తే ప్రపంచ బంగారం మార్కెట్‌పై ఈ టాప్ 10 దేశాల ప్రభావం చాలా కీలకం. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఈ దేశాల ఉత్పత్తి గణాంకాలు
గ్లోబల్ మార్కెట్ దిశను నిర్ణయించే అంశాలుగా మారుతున్నాయి.
Author: QAMAR SD
