📄 ePaper
Friday, February 20, 2026
📄 ePaper
HomeBusinessYear Ender 2025: ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బంగారం,...

Year Ender 2025: ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే.?

దేశంలో బంగారం, వెండి ధరలు 2025లో ఊహించని స్థాయిలో భగ్గుమన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. డిసెంబర్ చివరి నాటికి పసిడి, వెండి రేట్లు ఆకాశాన్ని తాకాయి. తాజాగా మాత్రం కొత్త ఏడాది ముందు స్వల్ప కరెక్షన్ కనిపిస్తోంది.

డిసెంబర్ 31 నాటికి తులం బంగారం ధర రూ.1,35,880 వద్ద కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.2,40,000 స్థాయిలో ట్రేడవుతోంది. కొన్ని రోజుల క్రితమే బంగారం రూ.1.42 లక్షల వరకు వెళ్లగా, వెండి రూ.1.70 లక్షల మార్క్‌ను దాటి సంచలనం సృష్టించింది.


2025లో బంగారం, వెండి ఎంత పెరిగింది? | Gold & Silver Price Growth in 2025

2025 జనవరి 1న దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,000గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.71,500 వద్ద కొనసాగింది. ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర రూ.1,35,880కు చేరింది.

అదే విధంగా వెండి ధర కూడా సంచలన ర్యాలీ చేసింది. జనవరిలో కిలో వెండి ధర సుమారు రూ.90,000గా ఉండగా, డిసెంబర్ చివరికి రూ.2,40,000కు చేరింది. ఒక్క ఏడాదిలోనే వెండి ధర రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

మొత్తంగా చూస్తే 2025లో బంగారం ధర సుమారు 74 శాతం పెరిగింది. వెండి అయితే ఏకంగా 138 శాతం వృద్ధిని నమోదు చేసింది.


రికార్డు ర్యాలీకి కారణాలేంటి? | Reasons Behind Gold & Silver Rally

మార్కెట్ నిపుణుల ప్రకారం 2025 సంవత్సరం విలువైన లోహాలకు అసాధారణమైన ఏడాదిగా నిలిచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వంటి అంశాలు బంగారం ధరలకు బలమైన మద్దతు ఇచ్చాయి.

ఇది కూడా చదవండి :  వెండి ధర పతనం ఎఫెక్ట్.. హిందుస్థాన్ జింక్ షేర్లు కుదేలు, సిల్వర్ ETFలలో అమ్మకాలు

అదే సమయంలో గోల్డ్ ETFలపై పెరిగిన డిమాండ్ కూడా పసిడి ర్యాలీకి ప్రధాన కారణంగా మారింది. వెండి విషయానికి వస్తే, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక రంగంలో డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు మరింత ఎగబాకాయి. సరఫరా–డిమాండ్ మధ్య గ్యాప్ కూడా వెండికి ప్లస్ పాయింట్‌గా మారింది.


12 నెలల్లో ఇతర పెట్టుబడులకంటే ముందున్న లోహాలు | Returns Compared to Other Assets

2025లో బంగారం, వెండి ఇచ్చిన రాబడులు స్టాక్ మార్కెట్‌ను కూడా మించిపోయాయి. వెండి ఈ ఏడాది దాదాపు 100 శాతానికి పైగా రాబడిని అందించగా, బంగారం సుమారు 83 శాతం రాబడిని ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ డిసెంబర్ 19, 2025 నాటికి కేవలం 9.4 శాతం రాబడినే అందించింది. దీంతో గత నాలుగు దశాబ్దాల్లో అత్యంత బలమైన కమోడిటీ ర్యాలీల్లో ఒకటిగా 2025 నిలిచిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో 2026లో కూడా బంగారం, వెండి ర్యాలీ కొనసాగుతుందా? అనే చర్చ ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page