HomeTelanganaAdilabadGet together | 23 ఏళ్ల తర్వాత... మళ్లీ అదే స్నేహం..!

Get together | 23 ఏళ్ల తర్వాత… మళ్లీ అదే స్నేహం..!

• ఇచ్చోడలో 2002–2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

• నాటి జ్ఞాపకాలతో భావోద్వేగం… 

• పాత మిత్రుల కలయికతో ఆనందోత్సాహం

• గురువుల సేవలను స్మరించుకున్న పూర్వ విద్యార్థులు

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 2002–2003 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించుకుని, అప్పటి పాఠశాల అనుభవాలు, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధం, తరగతి గదుల్లో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయిన అనంతరం వివిధ రంగాల్లో స్థిరపడిన సహచరులు తమ జీవిత ప్రయాణం, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.తమ జీవితాలకు దిశానిర్దేశం చేసి ఉన్నత స్థాయికి ఎదగడానికి పునాది వేసిన గురువుల సేవలను పూర్వ విద్యార్థులు స్మరించుకున్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పిన పాఠశాలతో తమకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.కాలం ఎంత గడిచినా పాఠశాల స్నేహబంధాలు ప్రత్యేకమైనవని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పాత మిత్రులను తిరిగి ఒకే వేదికపైకి తీసుకువచ్చి అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇకపై కూడా తరచూ కలుసుకోవడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతూ నాటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. కార్యక్రమం ఆద్యంతం ఆనందం, ఆత్మీయతతో కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular