HomeCrime Newsఅనుమతి లేకుండా డీజేల ఏర్పాటు.. నిర్వాహకులపై కేసు నమోదు

అనుమతి లేకుండా డీజేల ఏర్పాటు.. నిర్వాహకులపై కేసు నమోదు

• డీజేతో పాటు వాహనం సీజ్

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే ఏర్పాటు చేసిన మండప నిర్వాహకులతో పాటు డీజే యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందరయ్య నగర్‌లో గత రాత్రి వినాయక ప్రతిష్టాపన సందర్భంగా కొందరు ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా భారీ శబ్దాలతో డీజేను ఏర్పాటు చేశారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డీజేతో పాటు, దాన్ని ఏర్పాటు చేసిన వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా డీజేను అద్దెకు ఇచ్చిన యజమాని మహమ్మద్ అబ్దుల్ బషీర్‌తో పాటు, అందుకు కారణమైన గణపతి మండప కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.

గణేష్ ఉత్సవాల్లో డీజేల వినియోగానికి పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ లేవని సీఐ నాగరాజు స్పష్టం చేశారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలని, అధిక శబ్దం వచ్చే డీజేలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular