📄 ePaper
Thursday, April 30, 2026
📄 ePaper
HomePolitical Newsకవితక్క పార్టీ: పేరులో 'రక్షణ'.. క్లారిటీలో 'శిక్షణ' అవసరమా..?

కవితక్క పార్టీ: పేరులో ‘రక్షణ’.. క్లారిటీలో ‘శిక్షణ’ అవసరమా..?

• గంటకో పేరు.. ట్వీటుకో అబ్రివేషన్.. TRS అంటే తికమక రాష్ట్ర సమితి కాదు కదా?!

వాస్తవ నేస్తం హైదరాబాద్, రాజకీయ డెస్క్: రాజకీయాల్లోకి రావడం అంటే రాజన్న బిడ్డలాగా గర్జించడం అనుకున్నారో ఏమో కానీ, మన కవితక్క పెడుతున్న కొత్త పార్టీ వ్యవహారం చూస్తుంటే సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫుల్ టైమ్ వినోదం దొరుకుతోంది. పార్టీ పేరు విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. “మీకే క్లారిటీ లేకపోతే ఎలాక్కా?” అంటూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.

అప్పుడు ‘రాష్ట్ర’.. ఇప్పుడు ‘రక్షణ’!

మొన్న 28వ తేదీన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పడింది. అందులో TRS అంటే “తెలంగాణ రాష్ట్ర సేన” అని ఘనంగా ప్రకటించారు. సరే, పాత పేరు మీద మమకారంతో ‘రాష్ట్రం’ అని పెట్టుకున్నారేమో అని అందరూ సర్దుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఈరోజు సీన్ మారింది! తాజా ట్వీట్లలో మాత్రం TRS అంటే “తెలంగాణ రక్షణ సేన” అని దర్శనమిస్తోంది.

మొన్న రాష్ట్రం అన్నారు.. నిన్న రక్షణ అంటున్నారు.. రేపు మళ్ళీ ఇంకేదైనా అంటారేమో! అసలు ఈ ‘R’ కి మీ దగ్గర ఎన్ని అర్థాలు ఉన్నాయక్కా?” అని జనం జోకులు పేల్చుతున్నారు.

నిజానికి ఏ పార్టీకైనా గుర్తింపు రావాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నుంచి. కానీ ఇక్కడ మాత్రం ‘ట్విట్టర్’ (X) వేదికగానే పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇంకా రిజిస్ట్రేషన్ లేదు, గుర్తింపు లేదు.. అప్పుడే అబ్రివేషన్ల మీద ప్రయోగాలు మొదలైపోయాయి.

ఇది కూడా చదవండి :  BRS Vs Congress | బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఢీశుం.. ఢీశుం

సోషల్ మీడియా సెటైర్లు: 

“ఇది పొలిటికల్ పార్టీనా? లేక ఏదైనా క్విజ్ ప్రోగ్రామా? రోజుకో అర్థం చెబుతున్నారు!”.. “బహుశా కవితక్క గారు డిక్షనరీ పట్టుకుని కూర్చున్నట్టున్నారు.. రోజుకో పదాన్ని ట్రై చేస్తున్నారు.”.. “పార్టీ నెలకొల్పే వారికే పేరు మీద క్లారిటీ లేకుంటే.. ఇక కార్యకర్తలు ఏ జెండా పట్టుకోవాలి? ఏ నినాదం ఇవ్వాలి? అని చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయాల్లో సెంటిమెంట్ కంటే స్పష్టత ముఖ్యం. పేరులోనే ఇన్ని మలుపులు ఉంటే, ఇక సిద్ధాంతాల దగ్గర ఇంకెన్ని తికమకలు ఉంటాయో అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఆ ‘TRS’ అంటే ఏంటో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటే, జనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. లేదంటే, ఈ “పేర్ల మార్పిడి” ప్రక్రియే ఒక పెద్ద కామెడీ షోలా మారేప్రమాదం ఉంది.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88