📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeBusinessప్రపంచ మార్కెట్ దిశ మారుతోందా.. బంగారం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్...

ప్రపంచ మార్కెట్ దిశ మారుతోందా.. బంగారం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో బంగారం మరోసారి కీలక పాత్ర పోషించబోతోందన్న సంకేతాలు బలపడుతున్నాయి. 2025లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు, 2026లోనూ అదే వేగంతో కొనసాగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత మార్కెట్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ.2,000కు పైగా పెరిగి రూ.1.38 లక్షల మార్కును తాకడం గమనార్హం.

ఈ ఆకస్మిక పెరుగుదల సామాన్య కొనుగోలుదారులకే కాదు, పెట్టుబడిదారులను కూడా అయోమయంలో పడేసింది.
బంగారం ధరలు ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి అనే ప్రశ్నకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో కీలక వివరాలు వెల్లడించింది.

ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత పెరిగిన ప్రతిసారి పెట్టుబడిదారులు నమ్మకమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారని
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా డాలర్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా బంగారం నిలుస్తోంది. ఇటీవల వెనిజులాకు సంబంధించిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.

రికార్డు స్థాయిలో ట్రేడింగ్ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. 2025 మొదటి అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ సగటు బంగారం వ్యాపారం
329 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ సుమారు 5.1 ట్రిలియన్ డాలర్లకు చేరడం విశేషం.

దీర్ఘకాలిక రాబడుల పరంగా బంగారం స్థిరమైన ఆస్తిగా కొనసాగుతోందని నివేదిక చెబుతోంది. గత 50 ఏళ్లుగా బంగారం ధర సగటున ఏడాదికి 8 శాతం చొప్పున పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ రాబడులతో పోటీ పడుతూ, బాండ్లతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఇస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి :  Gold, Silver Rates Jan 1: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లకు ఊరట

బంగారం ప్రత్యేకతల్లో మరో ముఖ్య అంశం దాని పునర్వినియోగ సామర్థ్యం. ఇప్పటివరకు భూమి నుంచి తవ్విన ప్రతి ఔన్సు బంగారం ఏదో ఒక రూపంలో ఇప్పటికీ వినియోగంలో ఉందని
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుర్తు చేసింది. నగలు, వైద్య పరికరాలు, సాంకేతిక పరికరాల్లో బంగారం విస్తృతంగా ఉపయోగంలో ఉంది.

Gold price outlook 2026 explained by World Gold Council
World Gold Council explains why gold prices may continue to rise

అయితే బంగారానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది. బంగారం నుంచి వడ్డీ లేదా నెలవారీ ఆదాయం లభించదు. ధర పెరిగిన తర్వాత విక్రయించినప్పుడే లాభం వస్తుంది. ఈ అంశాన్ని కొందరు ఆర్థిక నిపుణులు లోపంగా పేర్కొంటున్నారు.

ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Author: Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page