తెలంగాణలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాప్తిపై ICMR-NCDIR 2026 నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ICMR report 2026 హైదరాబాద్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, పురుషుల కంటే మహిళలకే క్యాన్సర్ ముప్పు ఎక్కువగా పొంచి ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. Hyderabad cancer report 2026
• భయపెడుతున్న గణాంకాలు: హైదరాబాద్లో ప్రతి 6 మంది మహిళల్లో ఒకరు 74 ఏళ్ల వయస్సు వచ్చేలోపు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
• ఉల్టా ట్రెండ్: దేశంలోని చాలా నగరాల్లో పురుషుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటే, హైదరాబాద్లో మాత్రం మహిళల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
• ఆరోగ్యశ్రీ నివేదిక (2020-25): ఈ ఐదేళ్ల కాలంలో లక్షకు పైగా క్యాన్సర్ రోగులు చికిత్స పొందగా, వారిలో 10 మందికి గాను 6 గురు మహిళలే కావడం గమనార్హం.
• అధిక కేసులున్న జిల్లాలు: రాష్ట్రంలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగుల్లో ప్రతి నలుగురిలో ఒకరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల నుంచే ఉంటున్నారు.
• రొమ్ము క్యాన్సర్లో దేశంలోనే నంబర్ వన్ హైదరాబాద్ , మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) అత్యంత ఎక్కువగా సోకుతోంది.
• దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే లక్ష మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రేటు బెంగళూరులో 47గా ఉంటే, హైదరాబాద్లో ఏకంగా 54గా ఉంది.
మేఘాలయతో పోలిస్తే ఇది దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉంది. దీనితో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ. 263 కోట్లు వెచ్చించింది. అంటే రోజుకు దాదాపు రూ. 72 లక్షలు ప్రభుత్వమే భరిస్తోంది. అయితే, రోగులు తమ జేబు నుంచి ఆసుపత్రి బిల్లుల కోసం ఖర్చు చేస్తున్న సొమ్ములు దీనికి అదనం.
• ఎన్ఎఫ్హెచ్ఎస్-5 (NFHS-5) నివేదిక ప్రకారం.. 30 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల ప్రతి 1,000 మంది మహిళల్లో 167 మందికి ఏదో ఒక రోజు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అయితే, కేవలం ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించడం సాధ్యమవుతుంది. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ బ్రెస్ట్, సర్వైకల్, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా మీ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో చేయించుకోవచ్చు.
క్యాన్సర్ రాకుండా ఉండటం మన చేతుల్లో లేకపోయినా, దానిని ముందస్తుగా గుర్తించడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ICMR report 2026 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పచుకోండి, అప్రమత్తంగా ఉండండి.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్