HomeTelanganaAdilabadSoya seed : సోయ రైతులు ఆధైర్య పడవద్దు : బోథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్...

Soya seed : సోయ రైతులు ఆధైర్య పడవద్దు : బోథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి అన్నారు. గత కొన్ని రోజులుగా బోథ్,ఇచ్చోడ , ఆదిలాబాద్ మార్కెట్ యార్డులలో సోయ ధాన్యాన్ని ఆరబెడుతున్నారని త్వరగా కొనుగోలు చేయాలని, వర్షం ద్వారా రంగు మారిన, నానిపోయిన ధాన్యాన్ని, అధిక మొత్తంలో దిగుబడి ఉండడం వల్ల ఒక ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రైతుల కోరడంతో అదిలాబాద్ జిల్లా కలెక్టర్, మార్క్ ఫేడ్ డిఎం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు సమాచారం అందించి త్వరలో సోయాబీన్ కొనుగోలు చేయాలని కోరారు. రెండు మూడు రోజుల్లో సోయాబీన్ పూర్తిస్థాయి కొనుగోలు షెడ్యూలు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి కార్యాలయం నుండి తెలిసినట్లు వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular